HomeTelugu News'శీలవతి' గా అనుష్క!

‘శీలవతి’ గా అనుష్క!

Anushka and Krish movie tit

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి -క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ వస్తున్న ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే అనుష్కపై కీలక సన్నివేశాలు తీస్తున్నట్టు సమాచారం.

‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఆసినిమాలో అనుష్క పాత్ర ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. స్టార్‌ హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లో ఆ ఛాలెంజింగ్‌ రోల్‌లో చేసింది అనుష్క. మరోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్‌ కావడంతో ప్రేక్షకులల్లో ఆసక్తినెలకొంది.

తాజాగా ఈమూవీకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది. ఈ మూవీ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోందట. తనకు జరిగిన ఓ అన్యాయంపై ఓ ఒడిశా అమ్మాయి చేసిన పోరాటమే.. అనుష్క కొత్త మూవీ కథ అని టాక్. అందుకని ఈ సినిమాకు ‘శీలవతి’ అని టైటిల్‌ ఫిక్స్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా అన్ని సౌత్ లాంగ్వేజ్ లలోనూ ఈ సినిమా రిలీజ్ కానుందట. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu