క్రిస్మస్‌ రోజు శాంటాగా మారిన సమంత‌ ఏం చేసిందో తెలుసా?

ప్రముఖ నటి సమంత క్రిస్మస్‌ రోజున శాంటాగా మారారు. హెచ్‌ఐవీ బాధిత చిన్నారులను కలిసి వారిలో ఆనందం నింపారు. చిన్నారులను స్వయంగా షాపింగ్‌మాల్‌కు తీసుకెళ్లి కొత్త దుస్తులు తీయించారు. అంతేకాదు వారితో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్ని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పిల్లల కళ్లల్లో మెరుపు తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు.

‘ఛారిటీ అంటే జాలి కాదు.. ప్రేమ. ఇక్కడ నేను చాలా ప్రేమ చూశా. హెచ్‌ఐవీ‌తో బాధపడుతున్న చిన్నారులు ఈ డిజైర్‌ సొసైటీలో ఉంటున్నారు. ఇక్కడ పిల్లలు, దీన్ని నడుపుతున్న నిర్వాహకులు.. ఈ ఏడాది నేను పొందిన మొత్తం స్ఫూర్తిని కేవలం ఒక్కరోజులో నాలో నింపారు. ఆ దేవుడు ఆశీర్వాదాలు వీరికి ఎప్పుడూ ఉండాలి’ అని సామ్‌ పోస్ట్‌ చేశారు.

అనంతరం ఓ బాలుడు షాపింగ్‌ మాల్‌లో నవ్వుతూ నిల్చున్న ఫొటోను సామ్‌ షేర్‌ చేస్తూ.. ‘అతడి చూపు చూడండి.. ఇవాళ నేను కొందరిలో ఆనందాన్ని నింపా.. అది క్రిస్మస్‌ను ఎంతో ప్రత్యేకం చేసింది. ఇవాళ శాంటాగా మారా, అందరు చిన్నారులు కొత్త దుస్తులు తీసుకున్నారు’ అని రాశారు. దీంతో సామ్‌ మంచి మనసును నెటిజన్లు సోషల్‌మీడియాలో ప్రశంసించారు.

View this post on Instagram

And then we dance 🤓💃💃

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on