అనుష్క అంటే పలికేదాన్ని కాదు!

 

 

anushka

 

 

ఒక్కో అవకాశాన్ని దక్కించుకుంటూ.. తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన మార్క్ ను క్రియేట్  చేసుకుంది నటి అనుష్క. హీరోలు లేకపోయినా పర్లేదు.. అనుష్క ఉంటే చాలు అనుకునే దర్శకనిర్మాతలు చాలా మందే ఉన్నారు. కత్తి పట్టి యుద్ధభూమిలో దిగాలన్నా.. యువతను తన అందాలతో కవ్వించాలన్నా.. అనుష్క తరువాతే ఎవరైనా.. యోగా టీచర్ గా ఉండే ఆమె
హీరోయిన్ గా ఎలా మారిందో.. ఒకసారి గతాన్ని గుర్తుచేసుకున్నారు.. ”పూరీ గారు సూపర్ సినిమాలో నాగార్జున గారితో కలిసి నటించే ఛాన్స్ ఇచ్చారు. నిజానికి అప్పటివరకూ నాకు యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఓ సంవత్సరం పాటు సినిమా ఇండస్ట్రీలో ఉండలేకపోయాను. హీరోలతో కలిసి నటించడానికి సిగ్గు పడేదాన్ని. నా మనసు వద్దని చెబుతున్నా.. పట్టుదలతో
నటన నేర్చుకున్నాను. నిజానికి నా అసలు పేరు స్వీటీ. సినిమా కోసం అనుష్క అని పెట్టారు. మొదట్లో అనుష్క అని ఎన్ని సార్లు పిలిచినా పలికేదాన్ని కాదు.. స్వీటీ అని పిలిస్తే మాత్రం వెంటనే పలికేదాన్ని అంటూ.. స్పష్టం చేశారు.