HomeTelugu Trendingప్రతి మహిళా పోలీస్ సిబ్బంది ఒక స్టార్: అనుష్క

ప్రతి మహిళా పోలీస్ సిబ్బంది ఒక స్టార్: అనుష్క

Anushka in She pahi first a
సైబరాబాద్‌లో మహిళా సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు. సైబరాబాద్‌లో 750 మంది మహిళా పోలీసులున్నారన్నారు. నగరంలో బుధవారం ‘షీ పహి’ ఫస్ట్ అన్యువల్ కాన్ఫరెన్స్ 2021 ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ.. ఇక్కడ ఉన్న ప్రతి మహిళా పోలీస్ సిబ్బంది ఒక స్టార్ లాంటి వారని. కోవిడ్ సమయంలో పోలీసులు చాలా బాగా పని చేశారని, తనను ఇలాంటి కార్యక్రమానికి పిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇంత మంది మహిళా పోలీస్‌లు ఉన్నందుకు గర్వంగా ఫీల్‌ అవుతున్నానని పేర్కొన్నారు. షీ పహి అనే పేరు పెట్టడం చాలా బాగుందన్నారు. సమాజంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం వివిధ పోలీస్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు ప్రశంస అవార్డులతో సత్కరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu