HomeTelugu Trendingవిరుష్కల పాప పేరేంటో తెలుసా!

విరుష్కల పాప పేరేంటో తెలుసా!

Anushka and virat kohli sha
బాలీవుడ్‌ బ్యూటీ, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ జనవరి 11న పండంటి పాప జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాగా తొలిసారిగా తన కూతురి ఫొటోను అనుష్క రివీల్‌ చేసింది. తమ ముద్దుల కుమార్తెకు ఈ జంట సోమవారం నామకరణం చేసింది. విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ పేర్లు కలిసేలా ‘వామికా’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని అనుష్క శర్మ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఎంతో ప్రేమానురాగాలతో నిండిన మా జీవితాల్లో వామికా ఆ సంతోషాలను మరింత రెట్టింపు చేసింది. తన రాక ఎన్నో వెలుగులను తీసుకొచ్చింది. ఆనందం, కన్నీళ్లు, ఆందోళన..ఇలా నిమిషాల వ్యవధిలోనే ఎన్నో భావోద్వేగాలు. కానీ మా హృదయం ఎంతో ప్రేమతో నిండి ఉంది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, ఆప్యాయతలకు ధన్యవాదాలు’ అంటూ అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

Recent Articles English

Gallery

Recent Articles Telugu