HomeTelugu Trendingగుణశేఖర్‌ 'శకుంతల' ఈమేనా?

గుణశేఖర్‌ ‘శకుంతల’ ఈమేనా?

Srikanth son roshan as hero 1
దర్శకుడు గుణశేఖర్ తాజాగా ‘శాకుంతలం’ అనే కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ”వెండితెరపై ‘హిరణ్యకశ్యప’ లోని నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. మహాభారతం ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథను ఆవిష్కరిస్తున్నాను” అని గుణశేఖర్ ప్రకటించాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ‘శాకుంతలం’ మోషన్ పోస్టర్ ని కూడా నిన్న విడుదల చేశాడు. ‘మరచిపోయిన ప్రేమ.. మరచిపోలేని ప్రేమ కథ’ అని మోషన్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ లో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. ఇందులో నటించే నటీనటుల వివరాలు వెల్లడించలేదు.

Anushka Shetty

శకుంతల – దుష్యంతుడిల ప్రేమ కథను ఇప్పుడు గుణశేఖర్ తెరకెక్కిస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు శకుంతలా దేవి పాత్రను ఎవరు పోషిస్తారనే అనేది ఆసక్తికరంగా మారింది. దుష్యంతుడితో ఆమె ప్రేమ.. వారి గాంధర్వ వివాహం.. భర్తకు దూరమై కష్టాలు అనుభవించడం ఇలా అనేక అంశాలు శకుంతల ప్రేమ కథలో ఉంటాయి. అలాంటి పాత్రకు ఎవరు న్యాయం చేస్తారు అని చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో స్టార్ హీరోయిన్ అనుష్క ‘శకుంతల’గా నటించనుందని ఓ వార్త ఫిలిం నగరంలో వినిపిస్తోంది. అంతేకాక సినీ ప్రియులు కూడా వరుస ట్వీట్లు చేస్తున్నారు. ‘గుణశేఖర్‌ సర్‌.. దయచేసి అనుష్కను హీరోయిన్‌గా తీసుకోండి’, ‘ఈ ప్రేమకథా చిత్రానికి అనుష్క చక్కగా నప్పుతుంది.’, ‘ఈ కథకి మా క్వీన్‌ సరిపోతుంది.’ అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో నటించేందుకు అనుష్క అంగీకారం తెలపాలంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు ఇంతకముందు గుణశేఖర్ మూవీ ‘రుద్రమదేవి’ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu