రామ్‌ చరణ్‌కి జపాన్ అభిమానుల నుండి గిఫ్ట్ !

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ తేజ్ మార్చి 27న తన 34వ పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా జపాన్ అభిమానుల నుండి ఆయనకు శుభాకాంక్షలు అందాయి. సుమారు 50 మందికి పైగా అభిమానులు మగధీర గ్రీటింగ్ కార్డ్స్ తయారుచేసి చెర్రీకి విషెస్ పంపారు. గ్రీటింగ్స్ అందుకున్న చరణ్ ‘జపాన్ నుండి స్వీట్ సప్రైజ్ అందింది. మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను’ అంటూ ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేశారు.