HomeTelugu Trendingఅనుష్క 'నిశ్శబ్దం' ప్రీ టీజర్‌

అనుష్క ‘నిశ్శబ్దం’ ప్రీ టీజర్‌

5 22అనుష్క నటిస్తున్న ‘నిశ్శబ్దం’ చిత్రానికి భారీ క్రేజ్ వచ్చింది. బాహుబలి వంటి భారీ సినిమా తరువాత అనుష్క నిశ్శబ్దం వంటి మ్యూజికల్ హర్రర్ సినిమాను ఎంచుకుంది. ఈ మ్యూజికల్ హర్రర్ వెనుక ఉన్న కథ ఏంటి అన్నది ఇప్పటి వరకు ఎవరూ రివీల్ చేయడం లేదు. నిశ్శబ్దం టైటిల్ పోస్టర్ లో అనుష్క చేతి వేళ్ళు ఓ ముద్రను ప్రతిభించే విధంగా ఉన్నాయి. ఆ ముద్ర దేనికి సంకేతం. దేని గురించి ఆ ముద్ర ఉన్నది అనే విషయాలు తెలియాల్సి ఉన్నది.

కాగా, దీపావళి సందర్భంగా ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన నిశ్శబ్దం ప్రీ టీజర్ ను విడుదల చేశారు. హర్రర్ సినిమాను తలపించే విధంగా ఉండే మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ రన్ అవుతుండగా.. ఓ ముద్ర కనిపిస్తుంది. ఆ ముద్ర ఏంటి.. సినిమాలో ఆ ముద్రను సంబంధం ఏంటి అన్నది సినిమాలో చూడాలి. కాగా, ఈ సినిమా టీజర్ నవంబర్ 7 వ తేదీన విడుదల కాబోతున్నది. పీపుల్స్ మీడియా పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu