HomeTelugu Trendingమాకు కరోనా లేదు.. చిన్న పిల్లల్లా నయన్‌, విఘ్నేశ్‌ డ్యాన్స్‌ .. వైరల్‌

మాకు కరోనా లేదు.. చిన్న పిల్లల్లా నయన్‌, విఘ్నేశ్‌ డ్యాన్స్‌ .. వైరల్‌

2 21

కరోనా వైరస్‌ రోజురోజుకీ విజృంభిస్తోన్న తరుణంలో సోషల్‌మీడియా వేదికగా ఫేక్‌ న్యూస్‌ కూడా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారని పేర్కొంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా నటి నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ కొవిడ్‌-19తో ఇబ్బందిపడుతున్నారని ట్విటర్‌లో వార్తలు దర్శనమిచ్చాయి. అంతేకాకుండా ప్రస్తుతం వారిద్దరూ ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో నయన్‌ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నెట్టింట్లో వరుస పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో నయన్‌, తన ఆరోగ్యం గురించి వస్తోన్న వార్తలపై విఘ్నేశ్‌ స్పందించారు. తాము ఎంతో ఆరోగ్యంగా ఉన్నామని పేర్కొంటూ ఓ ప్రత్యేక వీడియోను నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. సదరు వీడియోలో నయన్‌, విఘ్నేశ్‌ సరదాగా డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు.

‘మేము కరోనా బారినపడ్డామని వస్తోన్న వార్తలు, సోషల్‌మీడియా పోస్టుల్లో ఇలాంటి నిజం లేదు. మేము ఆరోగ్యంగా ఉన్నామని అభిమానులందరికీ తెలియజేస్తున్నాం. ఇలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేస్తున్న జోకర్స్‌ని, వాళ్ల జోక్స్‌ని చూసి నవ్వుకునే ఆనందాన్ని, ఆరోగ్యాన్ని దేవుడు మాకు ప్రసాదించాడు’ అని విఘ్నేశ్‌ పేర్నొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu