సైలెన్స్ మూవీపై మౌనం వీడిన చిత్ర బృందం

అనుష్క ప్రధాన పాత్రలో ‘సైలెన్స్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్‌ హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైలెన్స్ మూవీపై ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న టీమ్‌ ఇప్పుడు మౌనం వీడారు. ఈ నెలాఖరులో షూటింగ్‌ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజులతో పాటు హాలీవుడ్‌ యాక్టర్‌ మైఖేల్‌ మ్యాడ్‌సన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల కలిసి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 24న ప్రారంభించనున్నట్లు దర్శకుడు హేమంత్‌ వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్‌ అంతా యూఎస్‌లోనే జరగుతుందని తెలిసింది. కొంతమంది అమెరికా నటులు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్నారు. సైలెన్స్‌ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.