HomeTelugu Big Storiesఏపీ శాసన మండలికి మంగళం..!

ఏపీ శాసన మండలికి మంగళం..!

10 19
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకు శాసనసభ ఆమోదం తెలిపింది. శాసన మండలి రద్దుపై శాసనసభలో ఈరోజు ఉదయం సీఎం జగన్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం తీర్మానంపై ఉదయం నుంచి సభలో సభ్యులంతా చర్చించారు. నేడు అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ హాజరుకాలేదు. రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న సభకు హాజరు కావడం ఇష్టంలేదంటూ బాయ్‌ కాట్ చేసింది. చర్చలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యేలంతా మండలి రద్దుకే మొగ్గు చూపారు. చివరిగా సీఎం జగన్‌ చర్చలో పాల్గొని మండలి రద్దు తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందనే కారణాలను వివరించారు. అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ఈ తీర్మానంపై ఓటింగ్‌ ప్రక్రియ చేపడుతున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

ముందుగా సభలో సభ్యులు కాని మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోష్‌లను పక్కన కూర్చోవాలని సూచించారు. అనంతరం సభలో ఓటింగ్‌ చేపట్టారు. అనుకూలంగా ఉన్నవారు లేచి నిలబడాల్సిందిగా స్పీకర్‌ కోరగా సభ్యులంతా లేచి నిలబడగా శాసనసభ సిబ్బంది లెక్కించి అనుకూలంగా 133 మంది ఉన్నట్లు తేల్చారు. తటస్థంగా, వ్యతిరేకంగా ఎవరూ లేరని స్పీకర్‌ ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్‌ తెలిపారు. అనంతరం శాసన మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందినట్లు తమ్మినేని సీతారామ్‌ ప్రకటించారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి నుంచి గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుం

Recent Articles English

Gallery

Recent Articles Telugu