HomeTelugu News'వైఎస్ఆర్ పెళ్లికానుక' భారీగా పెంపు

‘వైఎస్ఆర్ పెళ్లికానుక’ భారీగా పెంపు

15 3ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. వైఎస్ఆర్ పెళ్లికానుక మొత్తాన్ని భారీగా పెంచింది. వైఎస్ఆర్‌ పెళ్లికానుక మొత్తాన్ని పెంచుతూ ఉత్వర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీలోని వధువులకు పెళ్లి కానుక పెంచింది సర్కార్… ఎస్సీ వధువుకు ఇచ్చే పెళ్లికానుకను రూ. 40వేల నుంచి రూ.లక్ష పెంచింది. కులాంతర వివాహం చేసుకునే ఎస్సీ వధువుకు ఇచ్చే పెళ్లి కానుకను రూ.75 వేల నుంచి రూ.1.20 లక్షలకు పెంచారు. ఎస్టీ వధువుకు ఇచ్చే పెళ్లికానుకను రూ.50 వేల నుంచి రూ. లక్షకు పెంచింది సర్కార్. ఇక, కులాంతర వివాహం చేసుకునే ఎస్టీ వధువుకు పెళ్లికానుక రూ. 75 వేల నుంచి రూ. 1.20 లక్షలకు.. బీసీ వధువుకు ఇచ్చే పెళ్లి కానుకను రూ. 35వేల నుంచి రూ.50వేలకు… కులాంతర వివాహం చేసుకునే బీసీ వధువుకు పెళ్లికానుక రూ. 50వేల నుంచి రూ. 75 వేలకు.. మైనారిటీ వధువుకు ఇచ్చే పెళ్లి కానుక రూ.50వేల నుంచి రూ.1లక్షకు.. డిఫరెంట్లీ ఏబుల్డ్ వధువుకు ఇచ్చే పెళ్లికానుక రూ.లక్ష నుంచి రూ.1.50వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఇక పెంచిన వైఎస్ఆర్ పెళ్లికానుక 2020 ఏప్రిల్ 2 నుంచి వర్తిస్తాయని ఆదేశాల్లో పేర్కొంది సర్కార్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu