Homeపొలిటికల్AP Politics: రంగంలోకి దిగిన చంద్రబాబు.. మరి జగన్‌?

AP Politics: రంగంలోకి దిగిన చంద్రబాబు.. మరి జగన్‌?

AP Politics

AP Politics: ఏపీలో ఎన్నికల పోలింగ్ తర్వాత కూడా ఉద్రిక్తత సాగుతుంది. ఎన్నికల తరువాత రాజకీయా నాయకులు అందరూ విరామం కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలు దగ్గరకు రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చారు. ఇప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న వచ్చిరాగానే.. రంగంలోకి దిగిపోయారు. టీడీపీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ నెల 31న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజక వర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. పలు కీలక అంశాలపై సూచనలు చేశారు. జూన్ 1వ తేదీన జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు వెంటనే ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

పోస్టల్ బ్యాలెట్‌లపై వెంటనే వైసీపీ చేస్తున్న రాద్దాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఓటమికి వైసీపీ నేతలు కారణాలు వెతుకుతున్నారని చంద్రబాబు అన్నారు. ఎన్నికల కమిషన్, పోలీసుల తీరుపై అందుకే విమర్శలు చేస్తున్నారని నేతలు చెప్పారు. కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీకి, డీజీపీ కు లేఖ రాయాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అబ్జర్వర్‌ను నియమించాలని టీడీపీ డిమాండ్ చేసింది. 175 నియోజకవర్గాలకు 120 మంది మాత్రమే పరిశీలకులను నియమించడం పట్ల టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించాలని లేఖ రాయాలని చంద్రబాబు నిర్ణయించారు. రేపు సాయంత్రం అమరావతికి చంద్రబాబు బయలుదేరనున్నారు.

మరో పక్క.. వైసీపీ నేతల్లో గందరగోళం, ఆందోళన చెందుతున్న టైమ్‌లో వారి అధినేత జగన్మోహన్‌ రెడ్డి విదేశాలకు వెళ్ళిపోయారు. ఇంకా అక్కడే కాలక్షేపం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన జగన్మోహన్‌ రెడ్డి ఇంకా విదేశాలలోనే సేద తీరుతుంటే, చంద్రబాబు నాయుడు అప్పుడే అంతిమ యుద్ధానికి సిద్దం రెడీ అంటున్నారు. కాగా జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. వీటి కోసం ఏపీ ప్రజలు ఎంతో ఉత్కఠంగా ఎదురుచూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!