Homeపొలిటికల్ఆంధ్రాలో ఆర్థిక సంక్షోభం.. బటన్ రెడ్డిని పీకేయండి బాబోయ్

ఆంధ్రాలో ఆర్థిక సంక్షోభం.. బటన్ రెడ్డిని పీకేయండి బాబోయ్

 

WhatsApp Image 2023 01 23 at 3.33.21 PMఆంధ్రలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మళ్లీ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవ్వడం అనేది దాదాపు అసాధ్యమే. కానీ, అంతా అవినీతి మయం అయిపోయిన ఈ కలియుగంలో ఏమైనా జరగొచ్చు. కాబట్టి.. ఏపీ ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు రాబోతున్నాయి. ఇంతకీ 2024లో కూడా జగన్ రెడ్డే మళ్లీ గెలిస్తే ఏం జరుగుతుంది ?, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర ప్రజలు ఏం నష్టపోతారు ?, దీర్ఘకాలికంగా ఏపీ రాష్ట్రానికి ఏమవుతుంది ?, ఒక్కమాటలో మొత్తం వినాశనలే. జగన్ రెడ్డి మళ్లీ గెలిస్తే.. అనుమానం లేకుండా ఆంధ్ర అప్పుల కుప్ప అవుతుంది. ఆలాగే, ఆంధ్రాలో ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలన్నీ ఆగిపోతాయి.

ఇక ఆంధ్రాలో కొత్త ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఇక ఉండదు. మొత్తం వాలంటీర్లదే పెత్తనం అయిపోతుంది. జగన్ రెడ్డి మళ్లీ గెలిస్తే.. ఆంధ్రాలో ఆర్థిక భారం పెరిగి, అభివృద్ధి పూర్తిగా ఆగిపోతుంది. ఒకే దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో కుంటుపడన అభివృద్ధి, ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కుంటుపడితే.. దేశంలో ఆంధ్రులకు ఉన్న గౌరవం కూడా పోతుంది. ఒక్కమాటలో శ్రీలంక లా ఆంధ్ర రాష్ట్రం మారే ఛాన్స్ ఉంది. కాబట్టి జగన్ రెడ్డికి ఓటు వేసే ముందు పై పరిస్థితుల పై అవగాహన తెచ్చుకుని ఓట్లు వేస్తే.. ఆంధ్ర ప్రజల తెలివితేటల పై పక్క రాష్ట్రాల వారికి మళ్లీ నమ్మకం కుదురుతుంది.

అయినా, జగన్ రెడ్డి మళ్లీ గెలుస్తాడా ? లేదా ? అనేది అసలు పాయింటే కాదు. ప్రస్తుతం జగన్ రెడ్డి కారణంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చేలా ఉంది. అయినా, ఒక రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం దేశ ఆర్థిక వ్యవస్థ పై కూడా ప్రభావం చూపుతుంది కదా. మరి అలాంటప్పుడు కేంద్రం ఎందుకు చూస్తూ ఊరుకోవాలి. ఎలాగూ జగన్ రెడ్డి ఉచిత పథకాల అమలు కేవలం ఒక పాలసీ మాత్రమే. వాటికి రాజ్యాంగ పరిరక్షణ ఏమీ లేదు. కోర్టులు కూడా ఏమీ చేయలేవు. కావున, ఇకనైనా జగన్ రెడ్డిని తప్పించవచ్చు కదా. బొమ్మలా ఉన్న రాష్ట్రపతి ఒక బొమ్మను పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించవచ్చు కదా. ఆర్థిక సంక్షోభం రాబోతున్న సమయంలో రాష్ట్రపతికి ఆ అధికారం ఉంది కదా.

కాబట్టి.. ఆంధ్ర రాష్ట్రం మేలు కోసమైనా ఈ బటన్ రెడ్డిని పక్కకీ నెట్టి కనీసం ఆంధ్రాలో రాష్ట్రపతి పాలన అయినా పెడితే… ఆంధ్ర బాగుపడుతుంది. అసలు బటన్ రెడ్డి లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అయితే… వెంటనే ఆ తర్వాత ఆ రాష్ట్రానికి ఒక సంవత్సరం అయినా రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu