‘అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు’ కాంటెస్ట్!

అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు అని చాలా మంది త‌మ మాట‌ల్లో అంటూ ఉండ‌టం మ‌నం చాలా సార్లు వినే ఉంటాం. జ‌నాల నోళ్ల‌లో బాగా నానిన అదే మాటతో సినిమా చేస్తున్నారు నారా రోహిత్‌, శ్రీ విష్ణు. వారిద్ద‌రు క‌లిసి న‌టించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబ‌ర్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. త‌న్య హోప్‌, సాష కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రమిది.  ఆర‌న్ మీడియా వ‌ర్క్స్ నిర్మిస్తోంది. రోహిత్ స‌మ‌ర్పిస్తున్నారు. ప్ర‌శాంతి, కృష్ణ విజ‌య్ నిర్మిస్తున్నారు.  ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ ఈ మ‌ధ్య ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. ఇందులో న‌టించిన న‌టీనటుల చిన్న‌ప్ప‌టి ఫోటోల‌ను చూపించి వాళ్లెవ‌రో క‌నిపెట్టిన వారికి అద్భుత‌మైన బ‌హుమతులను ఇస్తామ‌ని ఇటీవ‌ల సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్ల‌లో నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ప్రైజ్ ల్లో ఐప్యాడ్‌లు కూడా ఉండ‌టం ఆస‌క్తిక‌రం.దాంతో ఈ కాంటెస్ట్ కు విప‌రీత‌మైన స్పంద‌న వ‌చ్చింది. స్పంద‌న‌కు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చాలా ఆనందంగా ఫీల‌వుతున్నారు. అదే ఆనందంతో ఈ కాంటెస్ట్ కోసం మ‌రి కొన్ని రోజుల్లో ఇంకా ఆస‌క్తిక‌ర‌మైన ఫోటోల‌ను కూడా పోస్ట్ చేయ‌నున్నారు. అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు అక్టోబ‌ర్‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. యాక్ష‌న్ డ్రామాగా సాగే ఈ చిత్రంలో నారా రోహిత్ స్పెష‌ల్ పార్టీ పోలీస్ ఆఫీస‌ర్ నూరుద్దీన్ మొహ‌మ్మ‌ద్ అలీగా న‌టించారు.  క్రికెట‌ర్ కావాల‌నుకునే యువ‌కుడిగా శ్రీవిష్ణు న‌టించారు. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. టీజ‌ర్‌ను అతి త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates