HomeTelugu Newsవైష్ణవ్ తేజ్ మూవీ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్

వైష్ణవ్ తేజ్ మూవీ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్

Ranga Ranga Vaibhavanga
వైష్ణవ్ తేజ్ నటించిన మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా’ తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ని తమిళంలో రీమేక్ చేసిన గిరీశాయ దర్శకత్వం వహించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఓ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు.

జులై మొదటి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టైటిల్, టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్మాన్ మాలిక్, హరిప్రియ పాడిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి ఈ పాట హైలైట్ అవుతుందని చెప్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu