HomeTelugu Big Storiesరామ్‌ చరణ్‌ 16వ సినిమాకి ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం

రామ్‌ చరణ్‌ 16వ సినిమాకి ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం

AR Rahman going to work for
రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఇక ఈ సినిమా తరువాత చరణ్‌ ఉప్పెన డైరెక్టర్‌ బుచ్చిబాబు సన తో సినిమా చేయనున్నాడు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రీ ప్రోడ‌క్ష‌న్స్ ప‌నులు జ‌రుగుతుండ‌గా త్వర‌లోనే షూటింగ్ ప్రారంభంకానుంది.

ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ఈ రోజు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా త్వరలో తెరకెక్కనున్న RC16 సినిమాకి ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించ‌బోతున్న‌ట్లు మైత్రి మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతుంది.

కిలారు వెంకట సతీశ్‌ నిర్మించనున్న ఈసినిమా సెప్టెంబర్ నుంచి షురూ కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని సుకుమార్‌-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందించబోతున్నాడు. గేమ్‌ ఛేంజర్ సెట్స్‌పై ఉండగానే మరో సినిమా  అప్‌డేట్ రావడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మెగా అభిమానులు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu