HomeTelugu Trending99 సాంగ్స్ నిర్మాతగా ఏఆర్‌ రెహమాన్‌

99 సాంగ్స్ నిర్మాతగా ఏఆర్‌ రెహమాన్‌

9 18
సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తబోతున్నారు. ’99 సాంగ్స్‌’ అనే మ్యూజికల్‌ రొమాంటిక్‌ చిత్రం తెరకెక్కుతోంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ నిర్మాత, రచయితగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్‌ లాంచ్‌ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ కొత్త బాధ్యతల నిర్వహణ చాలా సవాలుగా ఉందని అన్నారు. ”ఒక చిత్రానికి సంగీతం మాత్రమే సమకూరుస్తున్నపుడు మా ఆలోచనలను పంచుకోవడానికి అనుభవం ఉన్న దర్శకుడు, పాటల రచయిత, నిర్మాత వంటి వారు ఉంటారు. ఇక్కడ రచయితను, నిర్మాతను నేనే. నాకు నచ్చినా దర్శకుడికి నచ్చకపోవచ్చు. అందుకే మేము ప్రతి పాటను మూడు నుంచి నాలుగు వెర్షన్లలో చేశాము. మూడు నెలల క్రితం వరకు మేము పడ్డ కష్టానికి ఫలితం ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది అన్నారు. 99 సాంగ్స్‌ చిత్రానికి విశ్వేశ్‌ కృష్ణమూర్తి సహ రచయిత, దర్శకుడు. హీరో, హీరోయిన్లుగా కొత్తవారైన ఇహాన్‌ భట్‌, ఎడిల్సే వర్గాస్‌లు పరిచయం కాబోతున్నారు. సీనియర్‌ నటులు మనీషా కొయిరాలా, లిసారే నటిస్తున్నారు. ఈ చిత్రం వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu