HomeTelugu Trendingటాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడికి గుండెపోటు..

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడికి గుండెపోటు..

9 4టాలీవుడ్ సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌కు హార్ట్ ఎటాక్‌తో ఆసుపత్రిలో చేరారు. ఈయన చాలా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ .. తెలుగులో సినిమాలతో పాటు పలు సీరియల్స్‌కు కూడా ఈయన మ్యూజిక్ అందించాడు. కృష్ణ వంశీ తెరకెక్కించిన ‘గులాబీ’ సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆతర్వాత సిందూరం, హ్యాండ్స్ అప్ ఇలా పలు సినిమాలకు మ్యూజిక్‌ అందించారు. హిందీ సినిమాలకు కూడా అయన సంగీతం అందించారు.

గురువారం ఆయన కు గుండె పోటు రావడంతో ఆయనను బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వెంటనే గుండెకు స్టంట్స్ వేశారు. ప్రస్తుతం ఆయన ఐసియులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu