విలన్ మళ్ళీ హీరోగా!

కడల్ చిత్రంతో తన రీ ఎంట్రీను ప్రారంభించాడు నటుడు అరవింద్ స్వామి. ఈ సినిమా ‘కడలి’ పేరుతో తెలుగులో రిలీజ్ అయింది. ఆ తరువాత తమిళంలో ‘తని ఒరువన్’,’బోగన్’ వంటి చిత్రాల్లో నటించి  నటుడిగా తన స్టామినాను నిరూపించుకున్నాడు.
 
తని ఒరువన్ తెలుగు రీమేక్ సినిమాలో కూడా అరవింద్ స్వామి నటిస్తుండడం విశేషం. ఇలా వైవిధ్యమైన పాత్రల్లో కనిపించడానికి ప్రయత్నిస్తున్న ఈ నటుడు త్వరలోనే హీరోగా కనిపించనున్నాడని సమాచారం. క్రైమ్ కథాంశంతో దర్శకుడు సెల్వ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
 
ఈ సినిమా షూటింగ్ డిసంబర్ 16న చెన్నైలో ప్రారంభం కానుంది. సెల్వ ఇప్పటికే దాదాపు ఇరవై చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఆయన రూపొందించిన ‘నాన్ అవనిల్లై’ బాణీల్లో భాగంగా రానున్న సినిమాలో అరవింద్ స్వామిని హీరోగా ఫైనల్ చేశారు.
 
ఈ సినిమాలో అరవింద్  స్వామి అయిదుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నారు. ఇప్పటికే ఓ పాత్రకు ఇనియా అనే అమ్మాయిని కన్ఫర్మ్ చేశారు. ఇతర హీరోయిన్స్ కోసం చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం అరవింద్ స్వామి త్రిషతో కలిసి ‘చదురంగ వేట్టై2’ సినిమాలో నటిస్తున్నాడు.