HomeTelugu Big Storiesది ఫ్యామిలీ మ్యాన్-2 ట్రైలర్ వచ్చేసింది

ది ఫ్యామిలీ మ్యాన్-2 ట్రైలర్ వచ్చేసింది

The Family Man2 Trailer

సమంత నటించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 4న ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ట్రైల‌ర్‌లో మ‌నోజ్ బాజ్‌పాయ్ జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన స్పెషల్‌ సెల్‌లో పనిచేసే శ్రీకాంత్. ఓ మధ్యతరగతి వ్యక్తి. శ్రీకాంత్‌పైనే ఎక్కువ స‌న్నివేశాల‌ను చూపించారు. ఇందులో సమంత సూసైడ్‌ బాంబర్‌గా కనిపించింది. డి గ్లామరస్ పాత్ర. ఇప్పటి వరకు సమంత ఇలాంటి పాత్రలో కనిపించలేదు. సమంత లుక్ వెబ్‌ సిరీస్‌పై అంచనాలు మరింతగా పెంచేస్తున్నాయి. ‘ఫ్యామిలీ మ్యాన్ 1’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌ను రాజ్‌ అండ్‌ డీకే డైరెక్షన్‌ చేశారు. ఇందులో ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సీజన్ 1 కంటే సీజన్ 2 మరింతగా ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu