HomeTelugu Trendingతమిళ అర్జున్‌ రెడ్డి 'ఆదిత్య వర్మ' టీజర్‌ వచ్చేసింది

తమిళ అర్జున్‌ రెడ్డి ‘ఆదిత్య వర్మ’ టీజర్‌ వచ్చేసింది

5 15తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌ రెడ్డి సినిమాను తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ రీమేక్‌ జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుండగా తమిళ వర్షన్‌ షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుంది. తమిళ్‌లో ఆదిత్య వర్మ పేరుతో విడుదల అవుతున్న ఈ సినిమాతో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ విక్రమ్‌ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన ఆదిత్యవర్మ యూనిట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా దాదాపు ఒరిజినల్‌ లానే తెరకెక్కించారు. సన్నివేశాలు హీరో యాటిట్యూడ్‌ లాంటివి అలానే దించేశారు. టీజర్‌లో లుక్స్‌, యాక్టింగ్‌ పరంగా ధృవ్‌ ఆకట్టుకున్నాడు.

ముందుగా ఈ సినిమాను సీనియర్‌ దర్శకుడు బాలా తెరకెక్కించగా అవుట్‌పుట్‌ నచ్చకపోవటంతో చిత్రయూనిట్ గిరీశయ్య దర్శకత్వంలో పూర్తి సినిమాను తిరిగి రూపొందించారు. ధృవ్‌ సరసన బనిటా సంధు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఈ4 ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu