కొత్తగా వెలిసిన ‘బిగ్‌బాస్‌ గణపతి’

టెలివిజన్‌ ప్రేక్షకులను అలరిస్తున్న అతి పెద్ద రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌2’. ఈ షోకి నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారా? అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క సామాజిక మాధ్యమాల వేదికగా ‘బిగ్‌బాస్‌ సీజన్‌2’ పై పెద్ద చర్చే నడుస్తోంది.

ఈ నేపథ్యంలో వినాయకచవితిని పురస్కరించుకుని ‘బిగ్‌బాస్‌ గణపతి’ కొలువుదీరాడు. కుర్చీలో కాలుమీద కాలువేసుకుని కూర్చొన్న గణపతి విగ్రహం ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీంతోపాటు, ‘బిగ్‌బాస్‌’ థీమ్‌తో ఏర్పాటు చేసిన వినాయకపందిళ్లు సైతం ఆకట్టుకుంటున్నాయి. కౌశల్‌ ఆర్మీ పేరుతో ఒక వినాయక మండపాన్నే ఏర్పాటు చేయటం విశేషం. ‘బిగ్‌బాస్‌ 2’లో వినాయక పూజా మహోత్సవాలు అంటూ మరో మండపం ఆకట్టుకుంటోంది.