HomeTelugu Newsబాలీవుడ్‌లోకి 'అరుంథతి'

బాలీవుడ్‌లోకి ‘అరుంథతి’

Arundhati remake in hindiటాలీవుడ్‌లో సూపర్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనుష్క. 2009 లో వచ్చిన ‘అరుంధతి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి వరకు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన అనుష్క.. అరుంధతి సినిమా తరువాత నటన పరంగా ఎలాంటి పాత్రనైనా చేయగలను అని నిరూపించింది. అయితే కోడి రామకృష్ణ డైరెక్షనలో తెరకెక్కిన ఈ సినిమాను, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించారు. ఇక 11 ఏళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను నిర్మాత అల్లు అరవింద్ మంచి ఫ్యాన్సీ ధరకు దక్కించుకున్నారు. ఇక ఈ సినిమాను హిందీలో మరో నిర్మాత మధు మంతెనతో కలిసి నిర్మించనున్నారు. అయితే తెలుగులో అనుష్క వేసిన అరుంధతి పాత్రకోసం హిందీ రీమేక్ లో బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనె లేదా కంగనా రనౌత్ ను తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను హిందీలో ఎవరు డైరెక్ట్ చేస్తారనేది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu