HomeTelugu Trendingప్రభాస్‌కు విలన్‌గా స్టార్‌ హీరో?

ప్రభాస్‌కు విలన్‌గా స్టార్‌ హీరో?

1 5

టాలీవుడ్‌ యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫెమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ప్రభాస్‌ ఈ సినిమా తర్వాత ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. మహానటి సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం అశ్విన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ గా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ముగ్గురిని అనుకుంటున్నాడట! అయితే అందులో ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియదు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలో విలన్ గా నటించేది అరవింద్ స్వామి అని వార్తలు వస్తున్నాయి. అయితే అరవింద్ స్వామి రామ్ చరణ్ హీరోగా వచ్చిన ధ్రువ సినిమాలో విలన్ గా నటించి అందరికి మెప్పించాడు. అయితే ఈ సినిమాలో ఆయన ఎలా కనిపిస్తారు అనేది చూడాలి మరి. ఇక 2021 చివర్లో సినిమాను విడుదల చేస్తామని అశ్విన్ ఇంతకముందే తెలియజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu