అఖిల్ కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదట!

అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాతగా నిర్మింపబడ్డ ‘హలో’ సినిమాకు అఖిల్ ఎంత పారితోషికం తీసుకున్నాడు అంటూ ఒక మీడియా సంస్థ ప్రతినిధి నాగ్ ను కార్నర్ చేస్తూ అడిగిన ప్రశ్న పై నాగార్జున స్పందిస్తూ.. ‘హలో’ కు సంబంధించి అఖిల్ కు ఒక్క రూపాయి కూడ పారితోషికంగా ఇవ్వలేదు అని అంటూ నాగార్జున ‘హలో’ హిట్ అయితే మాత్రం అఖిల్ కు 2కోట్లు ఇస్తాను అంటూ కామెంట్స్ చేసాడు. అయితే ఈ మొత్తం పారితోషికం గా కాకుండా అందమైన బహుమతి రూపంలో అని అంటూ నాగ్  అఖిల్ కు కండిషన్స్ పెడుతున్నాడు. 

‘హలో’ విడుదల తరువాత ఒక ఇంపోర్టెడ్ కారును గిఫ్ట్ గా అందించబోతున్నాడట నాగార్జున. ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న ఈసినిమాను ప్రమోట్ చేయడానికి అఖిల్ అమెరికా వెళ్లి సందడి చేస్తూ ఉంటే నాగార్జున ఇక్కడ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ‘హలో’ పై అంచనాలు పెంచడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.