ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాలుగో భార్య‌గా ఉండటానికి రెడీ: అషూ రెడ్డి


తెలుగు బిగ్‌బాస్‌ ఫేం అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్‌బాస్‌ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన బ్యూటీ అషూ రెడ్డి. ఈ ముద్దుగుమ్మ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ప‌డిచచ్చిపోతుంది. ఓ సారి త‌న ప్రైవేట్ పార్ట్స్‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ టాటూ వేయించుకొని దిగిన ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ్యగా.. ఆ ఫొటో వైరల్‌ అయింది. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని క‌లిసి అత‌నితో రెండు గంట‌ల సేపు మాట్లాడే అవ‌కాశం ద‌క్క‌డంతో ఉక్కిరిబిక్క‌రి అవుతున్న ఈ అమ్మ‌డు త‌న ఆనందాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంది.

నా దేవుడిని మ‌ళ్లీ క‌లుసుకునే అవ‌కాశం ద‌క్కింది. రెండు గంట‌ల పాటు మేమిద్ద‌రం మాట్లాడుకోగా, ఆయ‌న నాతో పాటు నేను వేసుకున్న టాటూ గుర్తుంద‌ని చెప్పారు. తిరిగి వెళ్లేట‌ప్పుడు.. ఆయ‌న స్వ‌ద‌స్తూరితో రాసిన లెట‌ర్ ఇచ్చి పంపారు. చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పటికీ నా ఫస్ట్‌ లవ్‌ పవన్‌ కళ్యాణ్‌’ అంటూ తన అభిమానాన్ని చాటుకుంది. అలానే త‌న‌కు ఇంత మంచి అవకాశం కల్పించిన దర్శకుడు క్రిష్‌కు కృతఙ్ఞతలు అంటూ పేర్కొంది. అయితే ఓ నెటిజ‌న్ అషూ రెడ్డిని.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాలుగోవ భార్య‌గా ఉంటారా, అని ప్ర‌శ్నించ‌గా అందుకు వెంట‌నే ఎస్ అని చెప్పింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

CLICK HERE!! For the aha Latest Updates