HomeTelugu Trendingఅశ్విన్‌ 'వచ్చిన వాడు గౌతం'

అశ్విన్‌ ‘వచ్చిన వాడు గౌతం’

Ashwin new movie announced
అశ్విన్‌ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వచ్చిన వాడు గౌతం’. తాజాగా ఈ సినిమా ప్రకటించేస్తూ.. టైటిల్‌ లుక్‌ విడుదల చేశాడు. ఈ చిత్రానికి మామిడాల ఎంఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. స్టెతస్కోప్ పట్టుకున్న చేతికి రక్తపు మరకలు కనిపిస్తున్నాయి.

AB 8 ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమా మెడికో థ్రిల్లింగ్ స్టోరీగా తెరకెక్కుతున్నట్టు టైటిల్ లుక్‌తో తెలుస్తుంది. షణ్ముఖ పిక్చర్స్‌ బ్యానర్‌పై అలూరి సురేశ్‌ నిర్మిస్తున్నారు. అలూరి హర్షవర్ధన్‌ చౌదరి సమర్పిస్తున్నారు. గౌరా హరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌. ఈ చిత్రానికి ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌ కాగా.. రామ్‌-లక్ష్మణ్‌ ఫైట్‌ మాస్టర్స్ అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. హీరోయిన్‌, ఇతర నటీనటుల వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.

కాగా అశ్విన్‌ బాబు హీరోగా వచ్చిన చిత్రం హిడింబ. ఈ సినిమా పర్వలేదు అని పించింది. స్టార్‌ యాంకర్‌ తమ్ముడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అశ్విన్‌ ఇప్పటికే నాలుగైదు సినిమాలు చేశాడు. అయితే అవి అతని అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. దీంతో సరైన హిట్‌ కోసం ఎదురుచుస్తున్నాడు అశ్విన్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!