HomeTelugu Trending'మహర్షి' రిలీజ్ డేట్ వెనుక ఉన్న కథ ఇదే!

‘మహర్షి’ రిలీజ్ డేట్ వెనుక ఉన్న కథ ఇదే!

14 4రేపు మే 9వ తేదీన టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నటించిన ‘మహర్షి’ సినిమా విడుదలకానుంది. ఈ రిలీజ్ డేట్ వెనుక చాలా కథ ఉంది. మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవిలు జంటగా వైజయంతి బ్యానర్ నిర్మించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ 1990 మే 9న విడుదలై భారీ సక్సెస్ సాధించింది. అలాగే గతేడాది వైజయంతి నిర్మాతలు నిర్మించిన ‘మహానటి’ సైతం మే 9న విడుదలై గ్రాండ్ సక్సెస్ అందుకుంది. అందుకే నిర్మాత అశ్వినీ దత్ ఆ లక్కీ డేట్‌ని ‘మహర్షి’ చిత్రానికి సెట్ చేశారు. ఆ రెండు సినిమాల్లాగే ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నారు. మరి చిరుకి దక్కిన మే 9వ తేదీ లక్ మహేష్ బాబుకి కూడా దక్కుతుందేమో చూడాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించగా అల్లరి నరేష్ ఒక కీలక పాత్రను చేయడం జరిగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu