అశ్వనీదత్ కు మనవడు పుట్టాడు!

స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న నిర్మాత అశ్వనీదత్.
అయితే ఈ మధ్యకాలంలో ఆయన హవా కాస్త తగ్గింది. అయితే ప్రస్తుతం తన అల్లుడు డైరెక్ట్
చేస్తోన్న చిత్రంతో మరోసారి ఫామ్ లోకి రావాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈలోగానే ఆయన
తాతయ్య అయిపోయాడు. అశ్వనీదత్ పెద్ద కుమార్తె ప్రియాంకా దత్, నాగాశ్విన్ అనే యువ
దర్శకుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరికి కొడుకు పుట్టినట్లుగా సమాచారం.
కొన్ని గంటల క్రితం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రియాంకా దత్ ఓ మగబిడ్డకు
జన్మనిచ్చింది. దీంతో వారి ఇంట్లో ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నారు. నాగాశ్విన్
ప్రస్తుతం తన మావయ్య నిర్మాణంలో అలనాటి తార సావిత్రి జీవిత కథను సినిమాగా
తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో నిత్యమీనన్ ప్రధాన పాత్ర పోషించనుంది.