‘అమీ తుమీ’ ఫస్ట్ లుక్!

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ “అమీ తుమీ”. వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు. ఈషా, అదితి మ్యాకల్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఊగాది సందర్భంగా విడుదల చేశారు.  
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. “చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న “అమీ తుమీ” ఫస్ట్ లుక్ ను ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం కోసం సింక్ సౌండ్ విధానాన్ని ఉపయోగించానున్నాం. సింక్ సౌండ్ కారణంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుంది. అవసరాల-అడివి శేష్ ల మధ్య సన్నివేశాలు టైటిల్ కు తగ్గట్లుగా ఉంటాయి. ఈషా, అదితి మ్యాకల్ పాత్రలు చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. త్వరలోనే ఆడియో మరియు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం. అందరూ తెలుగు ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్లతో  రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.