HomeTelugu Trendingవెంకటేష్‌ 'అసురన్‌' టైటిల్‌ ఇదేనా...!

వెంకటేష్‌ ‘అసురన్‌’ టైటిల్‌ ఇదేనా…!

 

8 19

తమిళ హిట్‌ ‘అసురన్‌’ తెలుగు రీమేక్‌లో విక్టరీ వెంకటేష్‌ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘నారప్ప’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తెగ ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం దర్శక, నిర్మాతలు అనుష్కను సంప్రదించారట. కొన్ని కారణాల వల్ల ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వెట్రి మారన్‌ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ‘వెంకీమామ’ తర్వాత వెంకటేష్‌ ఈ సినిమాకు సంతకం చేశారు. ఇందులో లుక్‌ కోసం గడ్డం కూడా పెంచారు. మాతృకలో ధనుష్‌, మంజూ వారియర్‌ జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. విక్టరీ వెంకటేష్‌ సినిమా టైటిల్‌ ఇదే అంటూ గుబురు గడ్డంతో ఉన్న వెంకటేష్‌ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

8a 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu