HomeTelugu Trending'అతిథి దేవోభవ' ఫస్ట్‌లుక్‌

‘అతిథి దేవోభవ’ ఫస్ట్‌లుక్‌

Atithi Devobhava first look
ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆది బ్లాక్, అమరన్, కిరాతక చేస్తున్నాడు. తాజాగా మరో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తో వచ్చాడు. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఆది తన తదుపరి మూవీకి సంతకం చేసాడు. పొలిమేర నాగేశ్వర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. సినిమాకి “అతిథి దేవోభవ” అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘అతిథి దేవోభవ’ షూటింగ్ మొత్తం పూర్తయింది. మేకర్స్ త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తుండగా, అమరనాధ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు తీసుకున్నారు. బ్యాక్-టు-బ్యాక్ సరికొత్త జోనర్లలో సినిమాలు చేస్తున్న ఆది ఎక్కువగా ప్రతిభావంతులైన యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆది బ్లాక్, అమరన్, కిరాతక, సినిమాలు ఉన్నాయి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu