విజయేంద్ర ప్రసాద్ ‘బ్రహ్మపుత్ర’


ప్రముఖ రచయిత.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోయే మూవీ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారన తెలిసిందే. కానీ అంతకుముందే ఆయన మరొక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 17వ శతాబ్దపు జనరల్ లచిత్ బోర్ఫుకాన్ స్టోరీని ‘బ్రహ్మపుత్ర: ది అహోం సన్ రైజెస్’ అనే నవల రూపంలో తీసుకొస్తున్నారు. ఇందు కోసం రాజ్యసభ ఎంపీ అయిన విజయేంద్ర ప్రసాద్.. గూఢచర్య కాల్పనిక రచయితగా మారిన నేవల్ ఆఫీసర్‌ కుల్‌ప్రీత్ యాదవ్‌తో కలిసి పనిచేస్తున్నారు. హార్పర్‌కాలిన్స్ పబ్లిషర్స్ ఇండియా.. మే 30న ఈ నవలను విడుదల చేస్తోంది.

లచిత్ బోర్ఫుకాన్ ఒకప్పుడు అస్సాంలోని అహోం రాజ్యంలో జనరల్. 1671 సరైఘాట్ యుద్ధంలో తన నాయకత్వ పటిమతో గుర్తింపు పొందాడు. మొఘలులను చాలాసార్లు ఓడించిన లచిత్.. వారి నుంచి గౌహతిని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఈ కథ యాక్షన్, రొమాన్స్ కలగలిసి ఉంటుంది. లచిత్.. అహోం రాజ్యాన్ని పాలించిన స్వర్గదేవ్ జయధ్వజ సింఘా కుమార్తె యువరాణి పద్మినితో ప్రేమలో పడతాడు. వీరి రొమాన్స్ గురించి తెలుసుకున్న రాజు.. లచిత్‌ని రాజధాని జోర్హాట్ నుంచి బయటకు పంపిస్తాడు.

కొన్ని రోజుల తర్వాత అహోం రాజధానిపై ఔరంగజేబు దళాలు దాడి చేస్తాయి. తద్వారా రాజ్యంలో కొంత భాగాన్ని మొఘల్‌లకు అప్పగిస్తాడు స్వర్గ దేవ్. కానీ క్రమంగా ప్రమాదంలో పడుతున్న రాజధాని నగరాన్ని యువరాజు చక్రధ్వజ్‌తో కలిసి రక్షించేందుకు పూనుకున్న లచిత్.. ఈ యుద్ధంతో అహోం రాజ్య భవిష్యత్తును ఏ విధంగా మారుస్తాడు? అనేది స్టోరీ. ఈ ‘బ్రహ్మపుత్ర’ నవలకు విజయేంద్ర ప్రసాద్‌‌కు కుల్‌ప్రీత్ యాదవ్ రచనా సహకారం అందించారు. ఈ నవల ఒక సంచలనంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates