HomeTelugu News'జబర్దస్త్‌' నటుడు వినోద్‌పై దాడి

‘జబర్దస్త్‌’ నటుడు వినోద్‌పై దాడి

8 17

‘జబర్దస్త్‌’ టీవీ షో హాస్యనటుడు వినోద్‌పై దాడి జరిగింది. ఇంటి కొనుగోలు వ్యవహారంలో చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో జరిగిన దాడిలో వినోద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తనపై హత్యాయత్నం చేశారంటూ వినోద్ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బుల వ్యవహారంలో గొడవ జరిగిందని.. ఇంటి యాజమాని కావాలనే తనను ఇంటిపైకి పిలిపించి కొందరితో కలిసి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని ఆయన వివరించారు. తనపై ప్రమీలా, అభిషేక్, సాయిచందర్ దాడి చేసి హత్యాయత్నం చేసినట్లు వినోద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 30 గజాల స్థలంలో గోడ నిర్మాణం విషయంలో ఈ గొడవ తలెత్తినట్లు పోలీసులు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu