దసరాకు రానున్న ‘మహానుభావుడు’!

శ‌ర్వానంద్ హీరోగా, మెహ‌రిన్ హీరోయిన్ గా, మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మొద్ లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం మ‌హ‌నుభావుడు షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది.ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో మ‌రియు పోలాచ్చి, రామొజీఫిల్మ్‌సిటి, హైద‌రాబాద్ లో ని అంద‌మైన లోకేష‌న్స్ లో షూటింగ్ జ‌రుపుకుంది. ఈ వారం నుండి ఆడియో సింగిల్స్ విడుద‌ల చేసి త్వ‌ర‌లోనే ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విజ‌య‌ద‌శ‌మి కి చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ… శ‌ర్వానంద్ హీరోగా మూడ‌వ చిత్రం, మారుతి ద‌ర్శ‌కుడిగా రెండ‌వ చిత్రం గా మా బ్యాన‌ర్ లో షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్రం మ‌హ‌నుభావుడు. మారుతి చెప్పిన కేర‌క్ట‌రైజేష‌న్ దాని నుండి వ‌చ్చిన కామెడి ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయ‌ని న‌మ్ముతున్నాం. ఈ టీజర్ ని 700 కి పైగా ధియేటర్స్ నిన్నటినుండి ప్రదర్సిస్తున్నాం.అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి విజ‌య‌ద‌శ‌మికి విడుద‌ల చేయటానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ.. భ‌లేభ‌లేమ‌గాడివోయ్ చిత్రం త‌రువాత నాకు బాగా న‌చ్చిన కేర‌క్ట‌రైజేష‌న్ తో చేస్తున్న చిత్రం మ‌హ‌నుభావుడు. అన్ని ప‌క్కాగా ఈ క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా కుదిరాయి. శ‌ర్వానంద్‌ కెరీర్ లో ఈ చిత్రం బెస్ట్ చిత్రం గా నిలుస్తుంద‌ని నమ్మ‌కం వుంది. శ‌ర్వానంద్ చాలా బాగా చేశాడు. ఫుల్ కామెడి వుంటుంది. ఈ చిత్రం మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరి గా వుంటుంది. ద‌స‌రా కి విడుదల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు. అని అన్నారు.