నాగబాబు చేతికి జబర్దస్త్‌

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆ షోను ఒక్కసారైనా చూడనివారుండరనే చెప్పాలి. వారంలో రెండు రోజులు కడుపులు చెక్కలయ్యేలా నవ్వించే ఈ షో అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా రేటింగ్స్ విషయంలో కూడా జబర్దస్త్ ఎప్పుడూ హైలో ఉంటుంది. ఈ షోకి ఇంతగా పాపులారిటీ రావడానికి తెరపై కనిపించే నాగబాబు, రోజాతో పాటు కంటెస్టెంట్స్ కామెడీ ఎంత ముఖ్యమో.. తెరవెనుక దర్శకులకు కూడా అంతే ఉంటుంది. జబర్దస్త్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న క్రియేటివ్ హెడ్స్ నితిన్-భరత్ ఇప్పుడు ఈ జబర్దస్త్ కామెడీ షో నుంచి బయటికి వచ్చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరో ఛానల్లో సుడిగాలి సుధీర్ యాంకర్‌గా వస్తున్న ‘పోవే పోరా షో’ కొనసాగింపు విషయంలో కూడా మల్లెమాలతో ఈ హెడ్స్‌కు క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ షో నుంచి వాళ్లు వాకౌట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో ఇప్పుడు జబర్దస్త్ యూనిట్ కంగారు పడుతున్నారు. ఇదే సమయంలో షో బాధ్యత అంతా నాగబాబు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. గతంలో కొన్ని సీరియల్స్ కూడా రాసిన అనుభవం నాగబాబు సొంతం. దాంతో ఇప్పుడు షోపై నాగబాబు స్పెషల్ కేర్
తీసుకుంటున్నట్లు సమాచారం.