HomeTelugu Trendingఅకీరా నందన్‌ సినీ ఎంట్రీ!

అకీరా నందన్‌ సినీ ఎంట్రీ!

Pawan Kalyans son turns music director

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వార‌సుడు అకీరా నంద‌న్ ఇటీవలే 19వ పుట్టినరోజు సెలబ్రేట్‌ చేసుకున్నాడు‌. ప్ర‌స్తుతం చ‌దువుకు, సంగీతం నేర్చుకోవ‌టంతో పాటు అడ‌పా ద‌డ‌పా బ‌య‌ట క‌నిపిస్తున్నాడు అకీరా. పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ మాత్రం అత‌ని సినీ ఎంట్రీ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

అభిమానులు అకీరాను హీరోగా చూడాల‌నుకుంటున్నారు. కానీ అకీరా మాత్రం సైలెంట్‌గా మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇవ్వ‌టానికి రెడీ అవుతున్నారనిపిస్తుంది. రైట‌ర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిల్మ్‌కు అకీరా సంగీతాన్ని అందించాడు. ఈ విష‌యాన్ని హీరో అడివిశేష్ తెలియ‌జేస్తూ రైట‌ర్స్ బ్లాక్ షార్ట్ ఫిల్మ్ లింక్‌ను ట్వీట్ చేశారు. ఓ రైట‌ర్ క‌థ‌ను రాసే క్ర‌మంలో ఎలాంటి స‌వాళ్ల‌ను ఫేస్ చేశాడ‌నేదే ఈ షార్ట్ ఫిల్మ్ క‌థాంశం. ఈ షార్ట్ ఫిల్మ్ వ్య‌వ‌థి నాలుగున్న‌ర నిమిషాలు. ఇందులో మ్యూజిక్ బావుంద‌ని కామెంట్స్ వ‌స్తున్నాయి. ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఇంగ్లీష్‌లోనే తెరకెక్కించారు. కార్తికేయ యార్లగడ్డ దీన్ని తెరకెక్కించారు.

అకీరా పియానోపై మ్యూజిక్ ప్లే చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైర‌ల్ కూడా అయ్యాయి. ఈ క్ర‌మంలో అకీరా సైలెంట్‌గా, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌లా ఎంట్రీ ఇచ్చేసి అంద‌రికీ షాకిచ్చాడ‌నే చెప్పాలి.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu