HomeTelugu Big Storiesఆనందయ్య చట్నీ.. జగపతిబాబుపై గోగినేని సెటైర్‌

ఆనందయ్య చట్నీ.. జగపతిబాబుపై గోగినేని సెటైర్‌

Babu gogineni satire on jag

టాలీవుడ్‌ నటుడు జగపతి బాబు ఆనందయ్య మందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగపతి బాబును టార్గెట్‌ చేస్తూ బాబు గోగినేని వ్యంగ్యంగా ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశాడు. ‘అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా.. ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ.. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచెం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు’ అంటూ జగపతిబాబుపై పోస్ట్‌ పెట్టాడు గోగినేని. జగపతిబాబు ఆయుర్వేదం బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారంటూ, జూబ్లిహిల్స్‌లో ఆస్పత్రి తెరవబోతున్నారంటూ ఓ లోకల్‌ ఇంగ్లీష్‌ వెబ్ సైట్‌లో వార్త వచ్చింది. ఆ వార్తను ఆధారంగా చేసుకుని ఇలా జగపతిబాబుపై సెటైర్లు వేశారు బాబు గోగినేని. మరి దీనిపై జగపతి బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

గతంలో జగపతి బాబు ఆనందయ్య మందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. ‘ఆయుర్వేదం అనేది తప్పు చేయదు.. శరీరానికి హానిచేయదు. ప్రకృతి, భూదేవి తప్పు చేయవు. ప్రజల్ని కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని కాపాడుతుంద‌ని ఆశిస్తున్నా.. ఆనందయ్యని దేవుడు ఆశీర్వదించాలి అంటూ ఈ జగపతి బాబు కామెంట్స్‌ చేశాడు. అంతేకాదు ఆనంద‌య్య గారి మందు శాస్త్రీయంగా అనుమ‌తి పొందుతుంద‌ని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu