
Bachchan duo purchases 10 luxury apartments in Mumbai:
బాలీవుడ్ లోని ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ తమ సంపాదనలో భాగంగా ముంబైలో భారీ స్థిరాస్తులు కొనుగోలు చేశారు. వీరు ఇప్పటికే ముంబై లోని పలు ప్రదేశాల్లో తమకు అనేక విలాసవంతమైన ఇళ్లను, భూములను కలిగి ఉన్నారు.
తాజాగా, బచ్చన్ కుటుంబం ముంబైలోని ములుంద్ ప్రాంతంలో ‘ఓబెరాయ్ ఎటెర్నియా’ లో పది అపార్ట్‌మెంట్స్ ను కొనుగోలు చేశారు. వీటి విలువ మొత్తం రూ.24.95 కోట్లు. ఈ అపార్ట్‌మెంట్స్ మొత్తం 10,216 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, వాటికి 20 కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. బచ్చన్ కుటుంబం ఈ కొనుగోలుకు సంబంధించిన స్టాంప్ డ్యూటీగా రూ.1.50 కోట్లు చెల్లించారు.
ఈ ఆస్తులన్నీ అక్టోబర్ 9, 2024న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇందులో ఎనిమిది అపార్ట్‌మెంట్స్ 1049 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, రెండు అపార్ట్‌మెంట్స్ కి 912 చదరపు అడుగుల కర్పెట్ ఏరియా ఉంది.
ఈ పది అపార్ట్‌మెంట్స్ లో ఆరు అభిషేక్ బచ్చన్ పేరున రిజిస్ట్రేషన్ చేయగా, మిగతా నాలుగు అమితాబ్ బచ్చన్ పేరున రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి. గత రెండు దశాబ్దాలలో, అమితాబ్ బచ్చన్, ఆయన కుటుంబం ముంబై మరియు చుట్టుపక్కల స్థలాలు, భవనాలు కొనుగోలు చేయడంలో రూ.200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారని చెప్పవచ్చు.
బాలీవుడ్ లో ప్రముఖ నటులు ఎక్కువగా తమ సంపాదనలో భాగంగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. సినిమాల ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని వారు విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ సంపదను భద్రపరుచుకోవడంలో బాగానే ఉపయోగపడుతోంది కూడా. ఇక అమితాబ్, అభిషేక్ ఇద్దరూ ప్రస్తుతం పలు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
Read More: Anushka వచ్చే ఏడాది రెండు సినిమాల్లో కనిపిస్తుందా?












