HomeTelugu Trendingరాంగ్‌రూట్లో వచ్చిన బస్సుకు ఎదురెళ్ళిన మహిళ.. నెటిజన్ల ప్రసంశలు..

రాంగ్‌రూట్లో వచ్చిన బస్సుకు ఎదురెళ్ళిన మహిళ.. నెటిజన్ల ప్రసంశలు..

7 24

కేరళకు చెందిన ఓ మహిళ రోడ్డుపై సరైన మార్గంలోనే వెళ్తుండగా ఒక బస్సు డ్రైవర్‌ తప్పుడు మార్గంలో ఆమెకు ఎదురుగా వచ్చారు. ఈ క్రమంలో ఆ మహిళకు పక్కకు తప్పుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆమె అలా చేయలేదు. తప్పుడు మార్గంలో వచ్చిన ఆ బస్సు డ్రైవర్‌కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని ధైర్యంగా తన స్కూటీని బస్సు ముందుకు తీసుకువెళ్లి ఉంచింది. దీంతో షాకైన బస్సు డ్రైవర్‌ నిబంధనల విషయంలో ఆమె వెనక్కు తగ్గేది లేనట్లు ఉంది అని గ్రహించి తన వాహనాన్నే నిదానంగా సరైన మార్గంలోకి మళ్లించుకొని వెళ్లారు. ఈ సన్నివేశాన్ని అక్కడే ఉన్న వాహనదారుల్లో ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ‘ఎవరైనా సరైన మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు వారికి ధైర్యం కలుగుతుంది ‘ అంటూ ట్విటర్‌లో ఆమెను ప్రశంసిస్తూ పోస్ట్‌ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu