HomeTelugu Trendingకరోనా ఎఫెక్ట్‌ మరోసారి షూటింగ్‌లకు బ్రేక్‌

కరోనా ఎఫెక్ట్‌ మరోసారి షూటింగ్‌లకు బ్రేక్‌

5 22
కారోనా వైరస్‌ నివరించేందుకు లాక్‌డౌన్‌ కారణంగా.. 3నెలలు షూటింగులు అన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా లాక్‌డౌన్ లో చేసిన సడలింపులతో ప్రభుత్వం సినిమా, సీరియల్ షూటింగ్ లకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. షూటింగ్‌లకు అనుమతిస్తూనే ప్రభుత్వం కొన్ని నిబంధనలను కూడా పాటించాలని సూచించింది. షూటింగ్ జరిగే ప్రాంతంలో శానిటైజేషన్ తో పాటూ సామజికదూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. 60 సంవత్సరాల పై బడిన వారు చిన్న పిల్లలు షూటింగ్ లో పాల్గొనకూడదంటూ అంటు పలు సూచలనలు చేసింది. కానీ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కొందరు షూటింగ్ చేస్తునట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా సీరియల్ నటుడు ప్రభాకర్ కరోనా భారిన పడ్డారు. దాంతో ఆ సీరియల్ లో నటిస్తున్న నటీనటులందరికీ కరోనా టెస్టులు చేశారు. వారి రిపోర్టులు రావడానికి మరో రెండురోజుల సమయం పడుతుంది. సీరియల్ నటుడికి కరోనా రావటంతో అన్ని సీరియల్స్ షూటింగ్లను నిలిపివేశారు. షూటింగులను కొనసాగించాలా లేదా అన్నదానిపై సమాలోచనలో పడ్డారు నటీనటులు, నిర్మాతలు. ఇక వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu