‘ఎఫ్‌3’లో ప్రగ్యా జైశ్వాల్‌!


అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఎఫ్‌3’. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. గతంలో వచ్చిన ‘ఎఫ్‌2’కు కొనసాగింపుగా ఈ సినిమా రాబోతోంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా ఆగిపోయింది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించనున్నారు.

ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ కోసం హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ను చిత్ర బృందం సంప్రదించిందట. మాస్‌, యూత్‌తో పాటు అన్ని వర్గాలను ఈ పాట ఆకట్టుకునేలా ఈ గీతం ఉంటుందని సమాచారం. దీంతో ఈ పాటకు కాస్త పేరున్న కథానాయిక అయితే బాగుంటుందని చిత్ర బృందం భావించిందట. అందుకే ప్రగ్యాను సంప్రాదించరట. ఆమెకు కూడా అందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. శ్రీ వెంకటేశ్వరక్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates