పవన్ తో క్రిష్.. ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేసే దర్శకుడు క్రిష్ ఈ ఏడాది ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను తెరకెక్కించాడు. కేవలం ఎనభై రోజుల్లో యుద్ధ నేపధ్యం గల ఈ సినిమాను తెరకెక్కించి తన సత్తాను చాటాడు. ఇప్పుడు బాలీవుడ్ లో ‘మణికర్ణిక’ అనే చారిత్రాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంతో బాలీవుడ్ లో తానేంటో నిరూపించుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత క్రిష్ తెలుగులో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
 
అది కూడా పవన్ కల్యాణ్ ఛాన్స్ ఇస్తే అతడిని డైరెక్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు క్రిష్. పవన్ లాంటి హీరోలతో కలిసి పని చేయాలని ప్రతి దర్శకుడు కోరుకుంటాడు. క్రిష్ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడని చెబుతున్నారు. నిజానికి ‘కంచె’ సినిమాకు ముందు క్రిష్.. పవన్ తో సినిమా చేయడానికి చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ ఏది వర్కవుట్ కాలేదు.
 
ఈసారి మాత్రం పవన్ కు తన కథ చెప్పి ఓకే చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడట. మరి పవన్ ఒప్పుకుంటాడా..? లేదా..? అనేది చూడాలి. ప్రస్తుతానికి పవన్-త్రివిక్రమ్ సినిమాతో బిజీగా గడుపుతున్నాడు. అలానే సంతోష్ శ్రీనివాస్ తో మరో సినిమా కమిట్ అయ్యాడు. నేసన్ సినిమా ఎలాగో లైన్ లో ఉంది. ఈ సినిమాలన్నీ ఎప్పుడు పూర్తి చేస్తాడు.. క్రిష్ కు ఛాన్స్ ఎప్పుడు ఇస్తాడు. అసలు ఈ కాంబోలో సినిమా వర్కవుట్ అవుతుందో.. లేదో.. చూడాలి!