చిరు కోసం బాహుబలి టీం!

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో తన జోరుని మళ్ళీ ప్రేక్షకులను రుచి చూపించాడు. ఇకపై అదే జోరుని కంటిన్యూ చేయబోతున్నాడు. ఈ నేపధ్యంలో పరుచూరి బ్రదర్స్ రచించిన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథతో సెట్స్ పైకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాను మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చారిత్రక నేపధ్యంలో సాగే ఈ సినిమాకు గ్రాఫిక్స్ తప్పనిసరి. విజువల్ అఫెక్ట్స్ భారీ స్థాయిలో ఉండడానికి ఈ సినిమాకు బాహుబలి టీం తో పనిచేయించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ విషయమై కమల్ కణ్ణన్ తో చర్చలు జరుపుతున్నారు. గతంలో రూపొందిన ‘మగధీర’,’బాహుబలి’ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించింది ఈయనే. దీంతో చరణ్.. చిరు సినిమా కోసం కమల్ కణ్ణన్ ను రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాడు.