విజయశాంతికి మహేష్‌ బాబు బర్త్‌ డే విషెస్‌

లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి పుట్టినరోజు నేడు(జూన్‌ 24). ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెకు సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పుట్టినరోజుతో ఆమె 55వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ట్విట్టర్‌ వేదికగా విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సూపర్‌ స్టార్ మహేష్‌ బాబుకు ధన్యవాదాలు తెలిపింది విజయశాంతి. ”థ్యాంక్యూ.. మహేష్‌ బాబు గారు” అని రాములమ్మ తన ట్వీట్‌లో పేర్కొంది. మహేష్‌ బాబుతో పాటు.. తనకు శుభాకాంక్షలు తెలిపిన సురేష్‌ ప్రొడక్షన్స్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపింది.

CLICK HERE!! For the aha Latest Updates