HomeTelugu Trendingబాలయ్య న్యూలుక్..‌ ఫొటో వైరల్‌

బాలయ్య న్యూలుక్..‌ ఫొటో వైరల్‌

Balakrishna bb3 look revealనందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ‘BB3’ టీజర్ లో బాలయ్య పంచె కట్టులో మీసం మెలేస్తూ తనదైన స్టైల్‌లో అదరగొట్టాడు. అయితే ఆయన ఈ చిత్రంలో అఘోరా పాత్రలో కనిపిస్తున్నట్లు మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ‘BB3’ సెట్స్ నుంచి బయటకు వచ్చిన బాలయ్య ఫొటోలో ఆయన లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తుంది.

హొలీ పండుగను ‘BB3’ చిత్ర బృందం సెట్స్ లో సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య ఓ చిన్న పాపతో రంగులు పూయించుకుంటున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బాలయ్య మెరిసిన గడ్డం చిన్నపాటి జుట్టుతో కొత్తగా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. బాలకృష్ణ ఇంతకముందెన్నడు కనిపించని విధంగా ఉన్న ఈ గెటప్ బీబీ3లో అఘోరా పాత్రకు సంబంధించినదని అందరూ భావిస్తున్నారు. ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారికంగా లుక్ రిలీజ్ అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ సినిమాలో.. సయేషా సైగల్ ,ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూర్ణ కీలక పాత్ర పోషిస్తోంది. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమా వేసవి కానుకగా మే 28న విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu