బాలయ్య ఫ్లాప్ సినిమాకు రెడీగా లేరు!

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ షూటింగ్ దాదాపు పూర్తయింది. దీంతో ఆయన తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు.  నిజానికి బాలయ్య తన 101 వ చిత్రం కృష్ణవంశీ ‘రైతు’ సినిమాలో నటించాల్సివుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా దర్శకుడు పి.వాసు, బాలయ్యను కలిసి కథ వినిపించాడట. వాసు తెలుగులో చంద్రముఖి, నాగవల్లి, కృష్ణార్జునులు వంటి సినిమాలు రూపొందించారు. అంతేకాదు బాలయ్య ఫ్లాప్ సినిమా ‘మహారథి’ చిత్రానికి కూడా ఆయనే దర్శకుడు.

వాసుకి హిట్ సినిమాల కంటే తెలుగులో ఫ్లాప్ ల సంఖ్యే ఎక్కువ ఉంది. అయితే ఇటీవల ఆయన కన్నడలో శివరాజ్ కుమార్ తో చేసిన ‘శివలింగ’  సినిమా మాత్రం మంచి సక్సెస్ అయింది. ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్ కు బాలయ్య రావడంతో.. ఆ కథను తెలుగులో బాలయ్య హీరోగా చేస్తాడనే ప్రచారం జరిగింది. కానీ వాసు ఓ ఫ్రెష్ కథతోనే బాలయ్యను సంప్రదించారు. ఆయన వినిపించిన కథ పట్ల బాలకృష్ణ పెద్దగా ఆసక్తి  చూపించలేదు. సున్నితంగా ఆ ప్రాజెక్ట్ ను రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది.