HomeTelugu Trendingఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా బాలయ్య సర్‌ప్రైజ్‌

ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా బాలయ్య సర్‌ప్రైజ్‌

Balakrishna surprise announ
నంద‌మూరి బాల‌కృష్ణ వరుస సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు బ‌స‌వ‌తారకం ఆస్ప‌త్రి ద్వారా తన వంతుగా క్యాన్స‌ర్ బాధితుల‌కు అండ‌గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే మే 28న లెజెండ‌రీ నటుడు ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా బాలకృష్ణ ఓ ప్ర‌త్యేక‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్నార‌న్నాట‌. రేపు స‌ర్ ప్రైజ్ అనౌన్స్ మెంట్ పై క్లారిటీ రానుంది. ఎన్‌బీకే ఫిల్మ్స్ బ్యాన‌ర్ నుంచి బాల‌కృష్ణ ఓ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఈ మేరకు రేపు (మే 27) ఉదయం 8.45 గంటలకు ఓ చిన్న సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం బాలకృష్ణకు సంబంధించిన నిర్మాణ సంస్థ ఎన్‌బీకే ఫిల్మ్స్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. అందులో ఎన్టీఆర్‌ ఫొటో ఉంచడంతో ఆ సర్‌ప్రైజ్‌ ఏమై ఉంటుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే మే 28న ‘అఖండ’నుంచి ఓ పాట విడుదల కాబోతుందని ప్రచారం కూడా జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాలనే రేపు వెల్లడిస్తాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా బాలకృష్ణ తండ్రికి నివాళిగా తన గానంతో ‘శ్రీరామదండకం’ విడుదల చేయనున్నాడని, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు ఉదయం 8.45కి రాబోతోందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరి బాలయ్య ఇచ్చే సర్‌ప్రైజ్‌ ఏంటో తెలియాలంటే రేపటి ఎదురు చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu