వైజయంతీ మూవీస్‌తో శ్రీకాంత్‌ కొడుకు

నటుడు శ్రీకాంత్ తనయుడిగా టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్. ‘నిర్మలా కాన్వెంట్’, ‘పెళ్లి సందడి’ లాంటి సినిమాల్లో హీరోగా నటించిన రోషన్‌కి ఇప్పటి వరకు సరైన సక్సెస్ రాలేదు. తాజాగా వైజయంతీ బ్యానర్ రోషన్ కోసం ముందుకొచ్చింది. సోమవారం రోషన్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటించాడు.

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ లో ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపాడు. ఈ సంస్థతో వేదాంస్ పిక్చర్ ప్రొడక్షన్స్ భాగస్వామ్య అవుంతుంది. రెండు సంస్థలు కలిసి రోషన్ తో సినిమా నిర్మించడానికి ముందుకొచ్చాయి.’అద్వైతం’ లఘ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న ప్రదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇతనికి దర్శకుడిగా తొలి అవకాశం ఇదే. అంతకు ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసాడు. ఆ ప్రతిభను గుర్తించే వైజయంతీ బ్యానర్ అవకాశం కల్పిస్తుందని టాక్‌.యాక్షన్ పీరియాడిక్ జోనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిసింది. త్వరలో సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వైజయంతీ సంస్థ ద్వారా అధికారికంగా బయటకు రానున్నాయి.

Srikanth Son to Act in Vyjayanthi Banner

రోషన్‌కి హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇది మంచి అవకాశం. ఇప్పటివరకూ పెద్ద బ్యానర్లో సినిమాచేసే అవకాశం రాలేదు. ‘నిర్మలా కాన్వెంట్’ సినిమా అన్నపూర్య స్టూడియోస్ నిర్మించినా అప్పటికీ రోషన్ నటుడిగా మొదటి సినిమా అనుభవం లేదు. అందువల్ల ఇది వర్కౌట్‌ కాలేదు.

ఇక ‘పెళ్లి సందడి’ సినిమాకి బ్యాకెండ్ రాఘవేంద్రరావు నిలిచినా ప్రేక్షకుల్ని ఆ సినిమా కూడా బొల్తాకొట్టింది. ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల మాత్రం వరుస అవకాశలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. రోషన్‌కి హీరోగా నిలదొక్కుకోలేకపోయ్యాడు. ఇప్పుడు ఈ సినిమా అయిన కలిసి వస్తుందోమో చూడాలి.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates